'టిల్లు స్క్వైర్' నుంచి 'టిక్కెట్టే కొనకుండా' ఫుల్ సాంగ్ రిలీజ్!
- క్రితం ఏడాది విడుదలైన 'డీజే టిల్లు'
- యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన కంటెంట్
- చకచకా జరుగుతున్న సీక్వెల్ పనులు
- సాంగ్స్ పరంగా మరింత కేర్ తీసుకున్న టీమ్
తాజాగా ఈ సినిమా నుంచి 'టిక్కెట్టే కొనకుండా .. ' అనే ఫుల్ సాంగును రిలీజ్ చేశారు. 'టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా .. సిట్టి నీది సినుగుతుందేమో సూడరబుల్లోడా' అంటూ ఈ పాట సాగుతోంది. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా, ఆయనే స్వయంగా ఆలాపించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు.
ఈ సినిమాలో సిద్ధూ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. 'డీజే టిల్లు' సినిమాను చాలావరకూ ఆ సినిమా టైటిల్ సాంగ్ నిలబెట్టేసింది. అందువలన సంగీతం పరంగా సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. సీక్వెల్ పై యూత్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.