బాలీలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. వీడియో ఇదిగో!
- సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సమంత
- స్నేహితులతో కలిసి బాలీ వెకేషన్ కు వెళ్లిన సామ్
- షార్ట్ హెయిర్ తో న్యూ లుక్ లో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ
ఇటీవల ఆమె కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేషన్ లో కొంత సమయాన్ని గడిపిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె మెడిటేషన్ చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన 'ఖుషి' చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ కూడా విడుదల కాబోతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోలేదు. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్స్ ను కూడా నిర్మాతలకు వెనక్కి తిరిగి ఇచ్చేసింది.
.