తెలుగు షట్లర్ సాత్విక్ మరో సంచలనం.. కొరియా ఓపెన్‌లో విజయం
- ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ జంటపై గెలుపు
- చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం
- కెరీర్లో మూడో సూపర్ 500 టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్
తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ తర్వాతి రెండు గేమ్స్‌లో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. సాత్విక్–చిరాగ్ కెరీర్లో ఇది మూడో సూపర్500 టైటిల్ కావడం విశేషం. ఇదివరకు థాయిలాండ్ ఓపెన్ (2019), ఇండియా ఓపెన్ (2022) గెలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో స్విస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్ గెలిచిన అతను ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.