భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాల పరిస్థితి ఇదీ..!
- పూర్తిగా నిండిన హిమాయత్ సాగర్
- నాలుగు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
- గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంటున్న ఉస్మాన్ సాగర్
మధ్యాహ్నం 12 గంటలకు నాలుగు గేట్లను 2 అడుగుల మేర తెరిచి దిగువకు 2,750 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. ఒంటి గంటకు మరో రెండు గేట్లు ఎత్తారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ గరిష్ఠ నీటి మట్టం (ఎఫ్టీఎల్) 1790 అడుగులు, నిల్వ సామర్థ్యం 3.900 టీఎంసీలు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు నీరు 1785.70 అడుగులకు చేరుకుంది. 2.954 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉన్నా ప్రస్తుతానికి ఔట్ ఫ్లో లేదు. అన్ని గేట్లు మూసి ఉంచారు. రిజర్వాయర్ నిండితే దీని నుంచి కూడా నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది.