వరుణ్ తేజ్-లావణ్య పెళ్లికి ముహూర్తం ఖరారు.. వేడుక ఎక్కడంటే..!
- గత నెల 9న ఇద్దరికీ ఎంగేజ్ మెంట్
- ఆగస్టు 24న పెళ్లితో ఒక్కటి కానున్న జంట
- ఇటలీలో వివాహ వేడుక జరుగుతుందని ప్రచారం
ఎట్టకేలకు వీరి పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 24వ తేదీన పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరగనుందని మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం. షాపింగ్, ఇతర పనుల కోసం వరుణ్, లావణ్య ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్టు చెబుతున్నారు. మిస్టర్ సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా టైమ్ లోనే వీరిద్ధరూ ప్రేమలో పడ్డారు.