ధ్యానం సింపుల్.. కానీ పవర్‌ఫుల్: సమంత
- కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్ళిన సమంత
- సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న నటి
- ధ్యానస్థితిలో తన అనుభూతిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్
‘‘మదిలో ఆలోచనల ఉద్ధృతి, శరీరంలో కదలికలు లేని నిశ్చలమైన స్థితి అసాధ్యమని నాకిప్పటివరకూ అనిపించింది. కానీ ఈ రోజు ధ్యానస్థితి నాకు శక్తి, ఆలోచనల్లో స్పష్టత, ప్రశాంతను ఇచ్చింది. సరళమైన ధ్యానప్రక్రియ ఇంతటి శక్తిమంతమైనదని ముందుగా ఎవరు ఊహించగలరు!’’ అని ఆమె ఇన్‌స్టాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. కార్యక్రమం తాలూకు ఫొటోలు కూడా షేర్ చేశారు.
