కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ చీఫ్‌ను కలిసిన ఎంపీ రఘురామ
- ఏపీలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై ఈసీకి ఫిర్యాదు
- ఆగస్ట్ తొలివారంలో రాష్ట్ర ఎన్నికల అధికారులతో భేటీ అవుతానన్న డిప్యూటీ చీఫ్
- దొంగ ఓట్ల నమోదుపై మరింత సమాచారం అడిగారని వెల్లడి
దొంగ ఓట్ల నమోదుపై మరింత సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి తనను కోరారని రఘురామ వెల్లడించారు. ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో ఎలాంటి తప్పులు జరిగినా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.