వెన్నెల వెలుగుల్లో సముద్రంలో ‘దేవర’ రక్తపాతం!
- సముద్రంలో రాత్రిపూట యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ
- ఐదు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తారక్ చిత్రం
- రేపటి నుంచి హైదరాబాద్‌లో ఆరో షెడ్యూల్!
గత రెండు వారాలుగా యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించారు. సముద్రం సెట్‌లో ఈ సీక్వెల్స్ తెరకెక్కించారు. రాత్రిపూట వెన్నెల వెలుగుల్లో ‘దేవర’సృష్టించే రక్తపాతాన్ని తన కెమెరాలో బంధించినట్టు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. ఈ సీక్వెల్‌తో చిత్రానికి సంబంధించిన ఐదు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రేపటి నుంచి ఆరో షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మరిన్ని యాక్షన్ సీన్స్ తీస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.