తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై రెండ్రోజుల తర్వాత మాట్లాడుతా: బొత్స
- నిధులు ఎవరు దారి మళ్లించారని టీడీపీని నిలదీసిన బొత్స
- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్న
- ప్రజల కోసం తాము నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టీకరణ
నిధులు దారి మళ్లించారన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని, కానీ తమపై విమర్శలు సరికాదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ నిధులు దోచుకున్నారన్నారు. ఇప్పుడు డబ్బులు ఎవరి దారి మళ్లిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రజల కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వివిధ పథకాల ద్వారా నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలపై స్పందిస్తూ... వివరాలు తెలుసుకొని వాటి భర్తీపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.