వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సమన్లు, ఎనిమిదో నిందితుడిగా చేర్చిన సీబీఐ
- అవినాశ్ రెడ్డి ప్రమేయంపై చివరి ఛార్జీషీట్‌లో సీబీఐ అభియోగాలు
- ఆగస్ట్ 14న హాజరు కావాలని పేర్కొన్న కోర్టు
- జైల్లో ఉన్న నిందితులంతా విచారణకు హాజరు
అవినాశ్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చి, ఆగస్ట్ 14న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆరో, ఏడో నిందితులుగా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని, 16న భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ రోజు సీబీఐ కోర్టులో విచారణ జరగగా జైలులో ఉన్న నిందితులను పోలీసులు హాజరుపరిచారు. వారికి రిమాండ్ ను ఆగస్ట్ 14 వరకు పొడిగించింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉన్నారు. దీంతో కోర్టుకు హాజరయ్యే బాధ్యతను సీబీఐకి కోర్టు అప్పగించింది.