నా మ్యారేజ్ లైఫ్ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలి: విజయ్ దేవరకొండ
- విజయ్, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా
- సినిమాలోని ‘ఆరాధ్య’ పాట తనకెంతో ఇష్టమన్న విజయ్
- సెప్టెంబర్ 1న విడుదల కానున్న చిత్రం
ఈ పాట గురించి విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఖుషి సినిమాలో ఇది తనకు ఇష్టమైన పాట అన్నాడు. పెళ్లయిన ఏడాది లోపు భార్యభర్తలు ఎలా ఉండాలి, వారి మధ్య అనుబంధం ఎలా వుండాలి? అన్నవి అద్భుతంగా చూపించారన్నాడు. భవిష్యత్తులో తన మ్యారేజ్ లైఫ్ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నానని విజయ్ తెలిపాడు. దాంతో, విజయ్ త్వరగా పెళ్లిచేసుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.