ఆ మూవీ హిట్ అయి ఉంటే ఇండస్ట్రీలో ఉండేదాన్ని..‘సింహాద్రి’ హీరోయిన్ అంకిత వ్యాఖ్య
- ‘విజయేంద్ర వర్మ’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నానన్న అంకిత
- సక్సెస్ ఉంటేనే కెరీర్ ముందుకు సాగుతుందని వెల్లడి
- 2009లో సినీరంగానికి దూరమైన అంకిత
- 2016లో వివాహం, ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్న నటి
‘‘విజయేంద్ర వర్మ సినిమాపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ చిత్రం హిట్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ముందుకు సాగుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించింది. 2004లో ‘విజయేంద్ర వర్మ’ తరువాత ఆమె నవదీప్ సరసన ‘మనసు మాట వినదు’, గోపిచంద్ నటించిన ‘రారాజు’లో నటించింది. రవితేజ్ హీరోగా రూపొందిన ‘ఖతర్నాక్’ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో తళుక్కుమన్న ఆమె 2009 నుంచి సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
అంకిత 2016లో విశాల్ జగపతి అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఆ తరువాత వారు అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు అబ్బాయిలు.