ఇతరుల మాదిరిగా పురందేశ్వరి బూతులు మాట్లాడే వ్యక్తి కాదు: కిరణ్ కుమార్ రెడ్డి
- ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి
- నేడు బాధ్యతల స్వీకరణ
- పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి
- ఇక మంచి భాష వినొచ్చని వ్యాఖ్యలు
- పురందేశ్వరి మంచి భాష మాట్లాడతారని వెల్లడి
పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారని తెలియగానే, ఇక మంచి భాష వినొచ్చు అనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు. "ఇతర అధ్యక్షుల మాదిరిగా పురందేశ్వరి బూతులు మాట్లాడే వ్యక్తి అయితే కాదు. ఇక నిరభ్యంతరంగా మన పిల్లలతో కలిసి వార్తలు చూడొచ్చు.
నాయకులు అంటే ఇలా మాట్లాడాలి అని పురందేశ్వరిని చూపించి కుటుంబ పెద్దలు తమ పిల్లలకు చెబుతారు. పార్టీ నాయకులు అంటే బూతులు మాట్లాడేవాళ్లు కాదని పురందేశ్వరి ప్రజలకు చాటిచెప్పే విధంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది.
మేం కలిసి పనిచేశాం. ఈ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి తీసుకురావడానికి, దక్షిణాది కోటను బద్దలు కొట్టడంలో మా వంతు సహకారం పూర్తిగా అందిస్తాం" అని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.