మమ్మల్ని చంపాలని చూస్తే మీ పాడె కడతాం: జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి వార్నింగ్
- తమ జోలికి వస్తే ఏం చేయాలో అదే చేస్తామని ఆగ్రహం
- 2024లో జేసీ కుటుంబానికి రాజకీయంగా సమాధి కడతామని వ్యాఖ్య
- అందరితో పాటు తనకూ బీమా వచ్చిందని స్పష్టీకరణ
అందరితో పాటు తనకూ రైతు బీమా వచ్చిందని, ఇందులో ఏమైనా అవినీతి జరిగితే నిరూపించాలని సవాల్ చేశారు. చీనీ తోటల బీమాపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు బీమాలో అవినీతి జరిగితే నిరూపించాలన్నారు. అంతేకానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.