చెప్పుతో కొడతానన్న కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
- ఆధారాలు చూపిస్తా మీ చిన్నాన్నను కొడతావా అంటూ ఛాలెంజ్
- ధర్మవరం, పుట్టపర్తి నుంచి కేతిరెడ్డి బాధితులు తనకు ఫోన్లు చేస్తున్నారని వెల్లడి
- ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మండిపడ్డ జేసీ
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డిలపై జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం విమర్శలు గుప్పించారు. దీనిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. దీంతో తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరోమారు మీడియా ముందుకువచ్చి కేతిరెడ్డిపై విమర్శలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలు అందిస్తానని, దమ్ముంటే నిందితులను చెప్పుతో కొట్టాలని సవాల్ చేశారు.