నయనతార - విఘ్నేశ్ శివన్ దంపతులపై మరో కేసు
- ఆస్తి వివాదంలో పోలీసులను ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్ బాబాయిలు
- విఘ్నేశ్ శివన్ తండ్రి తమకు తెలియకుండా ఉమ్మడి ఆస్తి అమ్మేశారని ఫిర్యాదు
- ఆస్తి కొనుక్కున్న వ్యక్తికి తగు డబ్బులు చెల్లించి వెనక్కు తెప్పించాలని డిమాండ్
- నయనతార, విఘ్నేశ్ శివన్, ఆయన తల్లిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
శివ కొళుదు అమ్ముకున్న ఆస్తి విషయమై తాజాగా ఆయన సోదరులు మాణిక్యం, కుంచిత పాదం పోలీసులను ఆశ్రయించారు. తమకు తెలియకుండా శివ అమ్ముకున్న ఆస్తిని కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి తిరిగి తెచ్చుకునేందుకు సాయపడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డీజీపీ ఆఫీసులో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులో విఘ్నేశ్ శివన్, ఆయన భార్య నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించాలని స్థానిక పోలీసులను డీజీపీ ఆదేశించారు.