జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు: ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్ వెంటే ఉన్నారన్న సుమన్
- జగన్ లా మేనిఫెస్టో అమలు చేసినవారు దేశంలో ఎవరూ లేరని కితాబు
- ప్రతిపక్షాల నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి అని వ్యాఖ్య
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్ వెంటే ఉన్నారని, రెడ్డి కమ్యూనిటీ కూడా మెజార్టీ ఆయన వైపు ఉందని చెప్పారు. జగన్ లా మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసినవారు దేశంలోనే ఎవరూ లేరన్నారు. నవరత్నాలు 95 శాతం అమలు చేశారని ప్రశంసించారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్నారని, ఆయన చేసిన సాయం ఎవరూ మరిచిపోలేరన్నారు. కేబినెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.