కొత్త జంటగా సమంత, విజయ్ గుడిలో యాగం
- రాజమండ్రిలో ఖుషి సినిమా షూటింగ్
- గుడిలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ
- చీర, పంచకట్టులో కనిపించిన సమంత, విజయ్
సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ తొలుత కొంత ఆలస్యం అయినా.. తర్వాత వరుస షెడ్యూల్స్ తో చిత్రీకరణ శరవేగంగా సాగింది. తాజాగా రాజమండ్రి సమీపంలోని ఓ దేవాలయంలో క్లైమాక్స్ సన్నివేశాల షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు సమచారం. షూటింగ్ స్పాట్ లో తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కుటుంబ సభ్యులంతా గుడిలో యాగం చేస్తుండగా చీరకట్టులో సమంత, పంచ కట్టుకున్న విజయ్ అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటగా కనిపించారు. ఇద్దరూ చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించారు. ఇది ఎండ్ టైటిల్స్ పడే సీన్ లా ఉంది. దాంతో, సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 1న పలు భాషల్లో విడుదల కానుంది.