ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ నుంచి అదిరిపోయే స్టిల్స్
- గబ్బర్ సింగ్ సెట్స్ లో సీన్లను పోలుస్తూ ఫొటోల విడుదల
- హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ జరుగుతుందని నిర్మాణ సంస్థ వెల్లడి
- పవన్–హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం
ఇందులో గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టిల్స్‌ను పంచుకుంది. పవన్ - హరీశ్ మధ్య అనుబంధాన్ని చెప్పేలా ఈ ఫొటోలు ఉన్నాయి. ‘కొన్ని విషయాలు, అనుబంధాలు ఎప్పటికీ మారవు’ అంటూ నిర్మాణ సంస్థ క్యాఫ్షన్ ఇచ్చిన ఈ ఫొటోలు నెట్ లో వైరల్ గా మారాయి. కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుందని, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఓ భారీ సెట్‌ను సిద్థం చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఆ సెట్‌లో పవన్‌కల్యాణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని వెల్లడించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ దీనిని నిర్మిస్తున్నారు.