హిట్ కాంబినేషన్ రిపీట్.. బన్నీతో త్రివిక్రమ్ నాలుగో సినిమా ఫిక్స్
- జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సూపర్ హిట్స్
- రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాణంలో నాలుగో చిత్రం
- ప్రస్తుతం గుంటూరు కారం, పుష్ప2లో బిజీగా ఉన్న త్రివిక్రమ్, బన్నీ
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో దాని సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాతనే అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఇద్దరి కాంబినేషన్ లో గత మూడు చిత్రాలకంటే ఇది భారీ స్థాయిలో ఉంటుందని ప్రకటించింది.