హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి ముందు వాటాదారులకు దీపక్ పరేఖ్ కీలక లేఖ
- వాటాదారులను ఉద్దేశించి దీపక్ పరేఖ్ రిటైర్మెంట్ లేఖ
- ఉత్తేజకరమైన భవిష్యత్తు దిశగా దూసుకు పోతున్నామని వ్యాఖ్య
- హెచ్‌డీఎఫ్‌సీ చరిత్ర తుడిచివేయలేనిదని, వారసత్వం కూడా ముందుకు తీసుకు వెళ్తుందని ఆశాభావం
విలీనానికి ముందు పరేఖ్ రాసిన లేఖలో... భవిష్యత్తు కోసం ఎదురుచూపులు, ఆశలతో హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు ఇది నా చివరి సంభాషణ కావొచ్చునని పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఉత్తేజకరమైన భవిష్యత్తు దిశగా మరింతగా దూసుకు పోతున్నామని చెబుతున్నానని, తనకు హెచ్‌డీఎఫ్‌సీ అనుభవం అమూల్యమైనదని చెప్పారు. మన చరిత్ర తుడిచివేయలేనిదని, మన వారసత్వం దీనిని అలాగే ముందుకు తీసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.