సోనియాను బలిదేవత అన్న రేవంత్, ఇప్పుడు సహపంక్తి భోజనం అంటున్నాడు: ప్రశాంత్
- అమరజ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందన్న రేవంత్ పై ఆగ్రహం
- అమరుల త్యాగాలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని వ్యాఖ్య
- తెలంగాణను కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే బలిదానాలు జరిగాయన్న మంత్రి
ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్, ఇప్పుడు అమరుల కుటుంబాలతో సోనియా సహపంక్తి భోజనాలు చేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను వ్యక్తిగతంగా తిడితేనే వార్తల్లో ఉంటామని రేవంత్ భావిస్తున్నారని, అందుకే ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.