బిడ్డతో కలిసి మీడియా ముందుకు రామ్ చరణ్, ఉపాసన.. అమ్మాయి ఎవరి పోలికో చెప్పిన చరణ్!
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన
- ఇంటికి బయల్దేరిన చిన్నారి, చరణ్, ఉపాసన
- ఏం పేరు పెట్టాలో తాను, ఉపాసన నిర్ణయించామన్న చరణ్
ఈ సందర్భంగా మీడియాతో చరణ్ మాట్లాడుతూ, తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.