క్రేజీ కాంబినేషన్.. చైతూ సరసన కీర్తి!
- చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా
- మహానటిలో అతిథి పాత్రలో నటించిన నాగ చైతన్య
- ఇటీవల వరుస ఫెయిల్యూర్ తో ఇబ్బంది పడుతున్న హీరో
అయితే, ఇప్పుడు కీర్తిసురేశ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే నానితో కలిసి నటించిన దసరా చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న కీర్తిని తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు, నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించారని సమాచారం. కథ చెప్పగా కీర్తి సురేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహానటి చిత్రంలో అతిథి పాత్ర చేసిన నాగ చైతన్య.. కీర్తితో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరు జంటగా నటిస్తే మరో క్రేజీ కాంబినేషన్ అభిమానులను అలరించనుంది.