ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ఎన్నారైల కష్టాలకు త్వరలో ముగింపు
- హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానాన్ని మరింత సరళీకరించే దిశగా అగ్రరాజ్యం
- స్వదేశానికి వెళ్లకుండానే వీసా రెన్యూ చేసుకునేందుకు ఎన్నారైలకు అవకాశం
- ఈ దిశగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న అమెరికా
- త్వరలో దీనిపై విస్పష్ట ప్రకటన విడుదల కానున్నట్టు సంబంధిత వర్గాల వెల్లడి
పైలట్ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా కొద్ది మంది విదేశీయులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఈ విషయమై నేడే అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హెచ్-1బీ వీసాదారుల్లో మెజారిటీ భారతీయులేనన్న విషయం తెలిసిందే. గతేడాది జారీ అయిన 4.42 లక్షల హెచ్-1బీ వీసాల్లో అత్యధికం భారతీయులే దక్కించుకున్నారు.