Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్సులో మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ ఫొటో షూట్
![Tamannaah Bhatia new photo shoot in black dress](https://imgd.ap7am.com/thumbnail/cr-20230619tn648fff249fc2f.jpg)
- టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మెప్పిస్తున్న తమన్నా
- విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించిన నటి
- లస్ట్ స్టోరీస్2 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న మిల్కీ బ్యూటీ
తన అందం, నటనతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. అక్కడ వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఫేమస్ అయిన లస్ట్ స్టోరీస్ రెండో సిరీస్ లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ చిత్రీకరణ సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఈ మధ్యే తమన్నా ఓపెన్ గా చెప్పింది. ఇక, ఇన్నాళ్లూ ముద్దు సీన్లకు దూరంగా ఉంటూ వస్తున్న మిల్కీ బ్యూటీ మారుతున్న కాలం దృష్ట్యా వాటికీ ఒకే చెప్పేసినట్టు ప్రకటించింది.
![](https://img.ap7am.com/froala-uploads/20230619fr648ffe70d69ff.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230619fr648ffe95927f8.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230619fr648ffea44ee58.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230619fr648ffec0e5774.jpg)