సింహా హీరోగా 'భాగ్ సాలే' .. రిలీజ్ డేట్ ఖరారు!
- శ్రీసింహా హీరోగా 'భాగ్ సాలే'
- డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన సినిమా
- సంగీతాన్ని అందించిన కాలభైరవ
- జులై 7వ తేదీన సినిమా విడుదల
ఇక ఇప్పుడు ఆయన తన తాజా చిత్రమైన 'భాగ్ సాలే' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. యశ్ రంగినేని .. అర్జున్ దాస్యన్ .. సింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. గతంలో ఒకటి రెండు తెలుగు సినిమాలు చేసిన నేహా సోలంకి ఈ సినిమాలో కథానాయిక.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. జులై 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీసింహాకి ఈ సినిమా ఆ ముచ్చట తీర్చుతుందేమో చూడాలి.