గేమ్ ఛేంజర్లో ‘ఆఫీసర్’గా అంజలి
- గేమ్ ఛేంజర్ నుంచి అంజలి ఫస్ట్ లుక్ విడుదల
- రామ్ చరణ్–శంకర్ చిత్రంలో తెలుగమ్మాయి కీలక పాత్ర
- హీరోయిన్ గా నటిస్తున్న కియారా
- దిల్ రాజు నిర్మాతగా వస్తున్న సినిమా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అంజలి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలో ఆమె పోస్టర్ ను విడుదల చేసింది. నల్లరంగు సూట్ దరించి, కళ్ల జోడు పెట్టుకొని, చేతిలో ఫైల్ తో మెట్లు ఎక్కుతున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో అంజలి ఓ అధికారి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా ఆద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.