చంచల్ గూడ జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి
- వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి
- చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డి
- ములాఖత్ లో భాగంగా తండ్రితో మాట్లాడిన అవినాశ్ రెడ్డి
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇటీవలే న్యాయస్థానం అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.