సుకుమార్ బ్యానర్లో ప్రభాస్ అడ్వెంచరెస్ థ్రిల్లర్!
- వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్
- ఆయనను ఒప్పించిన సుకుమార్
- సొంత బ్యానర్లో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
- ఆయన శిష్యుడే ఈ సినిమాకి డైరెక్టర్
సుకుమార్ శిష్యులు దర్శకులుగా తమ సత్తా చాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. వీళ్లంతా కూడా మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటూ ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్లో చేయడానికి హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. నిర్మాతగా ఇప్పటివరకూ ఓ మాదిరి హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన సుకుమార్, ఇప్పుడు ప్రభాస్ ను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇటీవల ప్రభాస్ కి సుకుమార్ ఒక కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. సుకుమార్ నిర్మించే ఈ సినిమాకి ఆయనే కథ.. స్క్రీన్ ప్లే .. మాటలు అందించనున్నాడని చెబుతున్నారు. సుకుమార్ శిష్యుడే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇది ఒక అడ్వెంచరెస్ థ్రిల్లర్ అనేది బలంగా వినిపిస్తున్న టాక్.