మోదీ ప్రజాస్వామ్య నేత.. రాహుల్ గాంధీ వారసత్వ నాయకుడు: బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ
- ఛాయిస్ ద్వారా వచ్చిన నేతకు, ఛాన్స్ ద్వారా వచ్చిన నేతకు తేడా ఉంటుందని వ్యాఖ్య
- మోదీ నేతృత్వంలో భారత్ ప్రతిష్ఠ రోజు రోజుకు పెరుగుతోందన్న ముక్తార్
- ప్రజల కోసం మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్న బీజేపీ నేత
మోదీ కిందిస్థాయి నుండి వచ్చారని, కామన్ మ్యాన్ బాధలు ఆయనకు తెలుసునని, అందుకే ప్రధాని వారి కోసమే ఎన్నో పథకాలు తీసుకు వచ్చారన్నారు. అభివృద్ధి, వివక్ష లేని సాధికారత మోదీ ప్రభుత్వ మంత్రం అన్నారు. అధికారంలో ఉండటం ద్వారా లీడర్ కాలేరని, ప్రజల కోసం పని చేయాలనే చిత్తశుద్ధి ఉండాలన్నారు. అలాగే దేశాన్ని ముందుకు నడిపించే ధైర్యం ఉండాలన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం అవాస్ యోజన, స్వచ్ఛ్ భారత్ మిషన్ వంటి పథకాల ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు.