గూగుల్ కీలక నిర్ణయం... ఈ విండోస్ వెర్షన్స్‌కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత!
- ఆగస్ట్ 2023 నుండి ఈ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటన
- విండోస్ 8 ఓఎస్ వినియోగించే యూజర్లు అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచన
- సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం
ప్రస్తుతం విండోస్ 8 ఓఎస్ ఉపయోగిస్తున్న యూజర్లు తమ కంప్యూటర్లలో ఓఎస్ ను విండోస్ 10కు అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. కాగా, గూగుల్ బ్రౌజర్ ద్వారా యూజర్లు డ్రైవ్ ను యాక్సెస్ చేసుకోవచ్చునని వెల్లడించింది. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.