మృగశిరకార్తె చేపప్రసాదం: నాంపల్లి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
- ఎగ్జిబిషన్ మైదానంలో అస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ
- పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు సూచన
ట్రాఫిక్ మళ్లింపు...
* మొజంజాహి మార్కెట్ నుండి ఎగ్జిబిషన్ మైదానం వైపు వెళ్లే వాహనాలను అబిడ్స్ - జీబీవో - నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
* ఎంజె బ్రిడ్జి - బేగంబజార్ ఛత్రి నుండి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలస్క టవర్స్ వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు.
* పీసీఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంపు, బీజీఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు. అయితే ఈ మార్గంలో అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.
* నాంపల్లి దిశగా కార్లలో వచ్చే వారు గృహకల్ప, గగన్ విహార్, చంద్రవిహార్ లో పార్కు చేసి అజంత గేట్ నుండి ఎగ్జిబిషన్ మైదానంలోకి రావాలి.
* వీఐపీ కారు పాస్ ఉంటే ఎంజే మార్కెట్ నుండి గాంధీ భవన్ వరకు వచ్చి ఎడమ వైపు తీసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ 1 నుండి రావాలి.
* నాంపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు గాంధీ భవన్ వద్ద యూటర్న్ తీసుకొని గేట్ 1, సీడబ్ల్యుసీ గేట్ ద్వారా లోపలకు వెళ్లాలి.
* చేప ప్రసాదం అనంతరం వీఐపీ వాహనాలు వీఐపీ, సీడబ్ల్యుసీ గేట్ నుండి అదాబ్ హోటల్ నుండి నాంపల్లి మీదుగా బయటకు వెళ్లాలి.