వివేకా హత్య కేసులో ఏ8 అవినాశ్ రెడ్డి.. కోర్టుకు తెలిపిన సీబీఐ
- వివేకా హత్య కేసులో అవినాశ్ నిందితుడేనన్న సీబీఐ
- హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాశ్ పాత్ర ఉందని వెల్లడి
- శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాశ్ హత్యాస్థలికి చేరుకున్నారన్న సీబీఐ
శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాశ్ రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని చెప్పింది. ఉదయం 5.20కి ముందే అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలతో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. కేసు పెట్టొద్దని, పోస్ట్ మార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్, శివశంకర్ రెడ్డి చెప్పారని వెల్లడించింది. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీకుమారులు భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.