'టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ ఖరారు!
- 2022లో వచ్చిన 'డీజే టిల్లు'
- పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమా
- అదే బ్యానర్లో రూపొందుతున్న సీక్వెల్
- సెప్టెంబర్ 15వ తేదీన విడుదల
సితార - ఫార్చ్యూన్ బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం, సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించింది. అలాంటి ఈ సినిమాకి అవే నిర్మాణ సంస్థలు 'టిల్లు స్క్వేర్' పేరుతో సీక్వెల్ ను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
'డీజే టిల్లు'లో నేహా శెట్టి కథానాయికగా నటిస్తే, 'టిల్లు స్క్వేర్'లో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నవారు అప్పటివరకూ ఆగవలసిందే.