ఏపీ ఫైబర్ నెట్ లో సినిమా విడుదలైన తొలి రోజే ప్రదర్శన.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న నట్టి కుమార్
- ఈ విధానం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేస్తుందన్న నట్టికుమార్
- సినీ పరిశ్రమను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్న
- పోసాని కృష్ణ మురళిపై కూడా విమర్శలు
సినీ పరిశ్రమను, నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్ ను సంప్రదించకుండానే, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని నట్టి కుమార్ ప్రశ్నించారు. తమ సినిమా ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రానప్పుడు ఈ విధానం ఎలా సక్సెస్ అవుతుందని అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను నాశనం చేసే ఈ విధానాన్ని ఎక్కువ మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సినీ రంగానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ... అందరి అభిప్రాయాలను తీసుకోకుండా ఈ విధానాన్ని ఆచరణలోకి తీసుకురావడం కరెక్ట్ కాదని అన్నారు.