కత్రినా కైఫ్ భర్తను పక్కకు నెట్టేసిన సల్మాన్ ఖాన్ బాడీ గార్డులు.. వీడియో వైరల్
- అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐఐఎఫ్ఏ కార్యక్రమంలో షాకింగ్ ఘటన
- బాడీగార్డుల తీరుపై నెట్టింట విమర్శలు, సల్మాన్ పైనా నెటిజన్ల గుస్సా
- ఘటనపై విక్కీ వివరణ
- వీడియోలో కనిపిస్తున్నట్టుగా అక్కడ పరిస్థితి లేదని వ్యాఖ్య
విక్కీని అవమానించారంటూ అనేక మంది నెటిజన్లు మండిపడ్డారు. ‘‘ఈ బాడీగార్డులకు అస్సలు మర్యాద తెలీదు’’ అని ఫైర్ అయిపోయారు. అయితే, బాడీ గార్డులు తోసిన విషయాన్ని పట్టించుకోకుండా విక్కీ సల్మాన్‌ను పలకరించాడు. ఈ క్రమంలో సల్మాన్ అతడికి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లిపోవడం కూడా నెటిజన్లకు కోపం తెప్పించింది. ‘‘విక్కీ అంత మర్యాదగా మాట్లాడుతున్నా సల్మాన్ అస్సలు ప్రతి స్పందించకపోవడం ఏమిటి? ఆయనకు ఇంత యాటిట్యూడ్ ఎందుకో’’ అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈ వైరల్ వీడియోపై విక్కీ కౌశల్ స్పందించారు. వీడియోలో కనిపిస్తున్నట్టుగా అక్కడి పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ‘‘చాలా సందర్భాల్లో అనవసర చర్చ జరుగుతుంటుంది. వీడియోలో కనిపిస్తున్నట్టుగా అక్కడ పరిస్థితి అస్సలు లేదు. కాబట్టి..దాని గురించి మాట్లాడటం వృథా’’ అంటూ ఈ కాంట్రవర్సీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.