తేజ దర్శకత్వంలో మరోసారి హీరోగా రానా!
- 'అహింస' రిలీజ్ పనుల్లో తేజ
- మరోసారి రానాతో కలిసి రంగంలోకి
- గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'నేనేరాజు నేనేమంత్రి'
- కొత్త ప్రాజెక్టు నిర్మాతగా ఆచంట గోపీనాథ్
ఈ సినిమా తరువాత తేజ ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుందనే ప్రశ్నకి సమాధానంగా రానా పేరు వినిపిస్తోంది. అవును.. రానా కథానాయకుడిగా తేజ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి ఆచంట గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
గతంలో తేజ - రానా కాంబినేషన్లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా వచ్చింది. 2017లో వచ్చిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. రానా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతోంది. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న రానా, ఇకపై దూకుడు చూపిస్తాడేమో చూడాలి.