తిరుపతిలో 'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఎప్పుడంటే..!
- పాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్'
- ప్రభాస్ సరసన నాయికగా కృతి సనన్
- జూన్ 6వ తేదీన తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్
- 16వ తేదీన ఐదు భాషల్లో సినిమా విడుదల
రామాయణాన్ని కథా వస్తువుగా చేసుకుని రూపొందిన ఈ సినిమాలో, సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు.
జూన్ 6వ తేదీన తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా సంచలనానికి తెరతీయడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.