ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని శరత్ బాబు నాకు చెప్పేవాడు: రజనీకాంత్
- కాసేపట్లో శరత్ బాబు అంత్యక్రియలు
- శరత్ బాబుకు పుష్పాంజలి ఘటించిన రజనీకాంత్
- ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన
శరత్ బాబు మృతి తనను కలచివేసిందని రజనీ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండేవారని, ఆయన కోపంగా ఉండటాన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నో సినిమాల్లో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని తనను ఎన్నోసార్లు వారించాడని తెలిపారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.