చేసిన తప్పులను .. పొందిన అవమానాలను గుర్తుపెట్టుకుంటాను: డైరెక్టర్ తేజ
- ఎవరేమనుకున్నా పట్టించుకోనన్న తేజ
- తన ఫ్లాపులను గురించి ఎక్కువగా మాట్లాడతానని వివరణ
- గతంలో తన ఇల్లు జప్తులోకి వెళ్లిందని వెల్లడి
"నేను నాలా ఉంటాను .. అది తిక్కా అనుకుంటే అనుకోండి. ఈ రోజున మీరు నన్ను తిట్టేసి మళ్లీ రేపు ఇంటర్వ్యూకి పిలిస్తే వచ్చేస్తాను. నేను నా హిట్స్ కంటే ఫ్లాపులను ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాను. చేసిన తప్పులను .. పొందిన అవమానాలను గుర్తుపెట్టుకుంటాను. అలా చేయడం వలన మరోసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటామనేది నా నమ్మకం" అని అన్నారు.
"ఒకసారి నేను మా ఇంటిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాను. ఆ తరువాత ఆర్థికపరమైన ఇబ్బందువల వలన కట్టలేకపోయాను. ఈ ఆస్తి బ్యాంకు జఫ్తులో ఉందని చెప్పి బ్యాంకు వారు నోటీస్ అంటించేసి వెళ్లిపోయారు. ఆ లోన్ తీర్చిన తరువాత కూడా నేను ఆ నోటీస్ తీయలేదు. ఎందుకంటే ఇంకోసారి లోన్ తీసుకోకూడదు అనే విషయం నాకు గుర్తుండటం కోసం" అని చెప్పుకొచ్చారు.