సాయంత్రంలోగా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం: రఘురామకృష్ణరాజు
- ఏపీ పోలీసులు చిల్లరగా వ్యవహరిస్తున్నారన్న రఘురాజు
- పులివెందుల నుంచి వచ్చిన ఆకు రౌడీలను అరెస్ట్ చేయలేరా? అని ప్రశ్న
- తనలాంటి వాళ్లను వేసుకెళ్లడానికే పోలీసులు ఉన్నారా? అని ఆగ్రహం
ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ... అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి అడ్డంకి తొలగినట్టేనని చెప్పారు. డీఐజీ, ఏపీ పోలీసులు చాలా చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ఆసుపత్రి వద్ద కడప, పులివెందుల నుంచి వచ్చి 10 మంది ఆకు రౌడీలు ఉంటే వారిని అరెస్ట్ చేయలేరా? అని ప్రశ్నించారు. తమలాంటి వాళ్లను వేసుకెళ్లడానికే ఈ పోలీసులు ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రంలోగా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని చెప్పారు. అవినాశ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కర్నూలు ఎస్పీ, డీఐజీ వంటి అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని అన్నారు.