మంచు మనోజ్ న్యూ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్ రిలీజ్!
- హీరోగా వరుస ఫ్లాపులు చూసిన మంచు మనోజ్
- చాలా గ్యాప్ తరువాత ఇస్తున్న రీ ఎంట్రీ
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'వాట్ ద ఫిష్'
- కొంతసేపటి క్రితం వదిలిన ఫస్టు గ్లింప్స్
- దర్శకుడిగా వరుణ్ కోరుకొండ పరిచయం
అలా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మనోజ్, ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా 'వాట్ ద ఫిష్' సినిమా రూపొందుతోంది. ఈ రోజున మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. రెండు విభిన్నమైన స్వభావాలు కలిగిన ఒక వ్యక్తిగా ఈ గ్లింప్స్ లో మనోజ్ కనిపిస్తున్నాడు.
విశాల్ బెజవాడ - సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ సినిమాకి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారనే విషయం అర్థమవుతోంది.