ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోమారు సీబీఐ నోటీసులు
- నిన్న తల్లి అనారోగ్యానికి గురవడంతో హాజరుకాని అవినాశ్
- సోమవారం ఉదయం 11కి విచారణకు రావాలంటూ పిలుపు
- శుక్రవారం విచారణకు రాకపోవడంతో తాజాగా నోటీసుల జారీ
ఇటీవల నోటీసులు జారీ చేయగా.. ముందస్తు అపాయింట్ మెంట్ లు ఉండడంతో విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు ఎంపీ లేఖ రాశారు. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు.దీంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు పంపారు. అయితే, అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యానికి గురవడంతో శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో శుక్రవారం కూడా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేకపోయారు.
ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు శనివారం మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న (సోమవారం) హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని అందులో సూచించారు.