కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డి తల్లికి చికిత్స
- ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యం
- పులివెందుల నుంచి హైదరాబాద్ తరలింపు
- మార్గమధ్యంలో కర్నూలులో చికిత్స
అటు, ఎంపీ అవినాశ్ రెడ్డి మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. వెంటనే పులివెందుల బయల్దేరారు. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, ఎంపీ అవినాశ్ రెడ్డి తన కాన్వాయ్ ని వెనక్కి తిప్పారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కర్నూలులో చికిత్స చేయించారు. అనంతరం ఆమెను హైదరాబాద్ తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.