రేపు ఎన్టీఆర్30 నుంచి ఫస్ట్ లుక్ విడుదల
- ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో కొత్త చిత్రం
- శుక్రవారం రాత్రి 7.02 గంటలకు ఫస్ట్ లుక్
- ఎన్టీఆర్ లుక్ కోసం అభిమానుల వెయిటింగ్
- అతని కంటే అతని కథ మరింత భయానకం అంటూ యువసుధ ఆర్ట్స్ ట్వీట్
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పలు పోస్టర్ లు వచ్చినా ఎన్టీఆర్ ఫ్రంట్ లుక్ చూపించలేదు. మొత్తానికి ఊర మాస్ సినిమా అని తెలుస్తూనే ఉన్నా, ఎన్టీఆర్ రౌద్ర రూపాన్ని అభిమానులు రేపు వీక్షించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. అతని కంటే అతని కథ మరింత భయానకం అంటూ ఎన్టీఆర్30పై మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతినాయకుడు అని తెలుస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.