రాష్ట్రం కోసమే యాగమని నమ్మించే గొప్పవాడివయ్యా.. జగన్ పై ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు
- జగన్ చేసిన యాగానికి సంబంధించిన వీడియో ట్వీట్ చేసిన ధూళిపాళ్ల
- శత్రువులు నాశనమైపోవాలని, కేసుల్లో సానుకూలత రావాలని సంకల్పం తీసుకున్నారని విమర్శ
- ప్రజలంతా ఆ సంకల్పాన్ని వినాలని పిలుపు
గురువారం ఈ మేరకు ధూళిపాళ్ల ఓ ట్వీట్ చేశారు. పూజారులు జగన్ చేత సంకల్పం చేయిస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘‘నీ శత్రువులు నాశనం అయిపోవాలి.. నీ కోర్టు కేసుల్లో సానుకూలత రావాలి.. అంటూ యాగ సంకల్పం చేసి.. రాష్ట్రం కోసం యాగం అని నమ్మించే గొప్పవాడివయ్యా’’ అంటూ జగన్ ను దుయ్యబట్టారు. ‘ప్రజలారా.. ఇదిగో ఈ సంకల్పం వినండి’ అని కోరారు.