స్ట్రీమింగ్ కి రెడీగా నిహారిక 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్!
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'డెడ్ పిక్సెల్స్'
- వీడియో గేమ్స్ నేపథ్యంలో నడిచే కథ
- ఈ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తున్న నిహారిక
- ఈ నెల 19 నుంచి అందుబాటులోకి
ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. గాయత్రిగా నిహారిక ప్రధానమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో, అక్షయ్ .. భావన .. వైవా హర్ష కనిపించనున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ .. ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించింది.
వీడియో గేమ్స్ చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. కొంతమంది యువతీ యువకులు వీడియో గేమ్ ఆడుతూ తమ చుట్టూ ఏం జరుగుతుందనేది పట్టించుకోకపోవడం వలన, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది? అనేది కథ.