వంట పాత్రలో మూత్రవిసర్జన చేసిన హాస్టల్ ఓనర్
- కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో షాకింగ్ ఘటన
- బాయ్స్ ప్రైవేట్ హాస్టల్ లో మహిళ నిర్వాకం
- సీసీటీవీ ఫుటేజీతో బయట పడ్డ ఘోరం.. స్టూడెంట్ల ఆందోళన
నగరంలోని మంకమ్మతోటలో ఉన్న వివేక్ బాయ్స్ హాస్టల్ మహిళా ఓనర్ ఈ నీచానికి పాల్పడింది. కిచెన్ లో వంటగదిని అపరిశుభ్రంగా వదిలేయడంతో పాటు విద్యార్థులకు వండిపెట్టే పాత్రలో మూత్రవిసర్జన చేసింది. కిచెన్ లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటపడడంతో సదరు ఓనర్ పై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. హాస్టల్ లో భోజనం తినడం మానేసి ఆందోళనకు దిగారు. హాస్టల్ కు నిర్వహణ అనుమతులను రద్దు చేసి, హాస్టల్ ను సీజ్ చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, రోజులు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు మీడియాను ఆశ్రయించారు.