కాంగ్రెస్-బీజేపీకి సమాన దూరం పాటిస్తాం.. థర్డ్ ఫ్రంట్‌లో చేరడం లేదు: నవీన్ పట్నాయక్
- మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన నవీన్
- ప్రధానితో 20 నిమిషాల పాటు భేటీ
- తమ విధానంలో మార్పు ఉండబోదన్న సీఎం
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. వారి మధ్య 20 నిమిషాలపాటు చర్చలు జరిగాయి. అనంతరం నవీన్ పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బిజూ జనతా దళ్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. కాంగ్రెస్-బీజేపీకి సమాన దూరం పాటించాలన్న తమ విధానానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కూటమి గురించి తాను చర్చించలేదని పేర్కొన్నారు.